Breaking News
Home / Crime / ఉత్తరప్రదేశ్‌లో దారుణం….

ఉత్తరప్రదేశ్‌లో దారుణం….

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘడ్‌లో జీవన్‌ఘడ్‌కు చెందిన ఫైజద్‌ అనే 20 ఏళ్ల యువకుడు గత కొంత కాలంగా ఓ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ క్రమంలో వారిమధ్య విభేదాలు తలెత్తడంతో నెల రోజులుగా ఆమెతో మాట్లాడటం మానేశాడు. దీంతో కోపోద్రిక్తురాలైన సదరు యువతి ఎందుకిలా చేస్తున్నావని అతడిని నిలదీసింది. ఇన్నాళ్లు తనతో సన్నిహితంగా ఉండి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఎందుకంటూ గొడవపడింది.

ఈ నేపథ్యంలో ఫైజద్‌ నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను అతడి ముఖంపై పోసింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఫైజద్‌ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ దాడికి పాల్పడిన సదరు యువతిని ఐపీసీ సెక్షన్‌ 326ఏ కింద అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *