Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ‘డిజిటల్ భేటీ’ ద్వారా మహిళలకు శిక్షణ

‘డిజిటల్ భేటీ’ ద్వారా మహిళలకు శిక్షణ

అమరావతి : గ్రామీణ ప్రాంత మహిళలకు ‘డిజిటల్ లిటరసీ’ని అందించేందుకు ప్రభుత్వం.. ‘ఫేస్‌బుక్ డిజిటల్ బేటీ’ ప్రోగ్రామ్ ద్వారా శిక్షణ ఇవ్వనుంది. ఫేస్‌బుక్‌తో కలిసి ‘స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(ఏపీఎస్‌ఎస్‌డీసీ)’ ప్రభుత్వం… ఈ డిజిటల్ బేటీ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన సీఎస్‌సీ అకాడమీ, ఫేస్‌బుక్ సంయుక్తంగా డిజిటల్ బేటీ ప్రోగ్రామ్‌ను అందిస్తున్న సంగతి తెలిసిందే.

గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, అమ్మాయిలు డిజిటల్ టూల్స్ ఉపయోగించుకొని ఆంట్రప్రెన్యూర్లుగా మారేందుకు ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. టెక్నాలజీ స్కిల్స్ ద్వారా వ్యాపారావకశాలను పెంచుకోవచ్చు. ఈ కార్యక్రమం ద్వారా ఐదు వేల మంది విలేజ్ లెవెల్ ఆంట్రప్రెన్యూర్‌లకు డిజిటల్ లిటరసీపైన శిక్షణ ఇవ్వడమే ‘డిజిటల్ బేటీ’ కార్యక్రమం ఉద్దేశం. శిక్షణ పొందిన ఐదు వేల మంది మరో పది రాష్ట్రాల్లోని మూడు వేల గ్రామాల్లో 2.50 లక్షల మంది రూరల్ ఎంటర‌ర్‌ప్రెన్యూర్‌లకు శిక్షణనిస్తారు. ఈ కార్యక్రమం ద్వారా శిక్షణ పొందే అమ్మాయిలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో తమ ఉద్యోగ, ఉపాధి అవకాశాలను పెంచుకోవచ్చు.

Check Also

గుంటూరు జిల్లాలో నేటి నుంచి నిబంధనలు మార్పు..

Share this on WhatsAppఏపీని కరోనా వణికిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగిపోతోంది. దీంతో జనాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *