Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ.. పోస్టింగ్స్..

ఏపీలో ఐఏఎస్‌ల బదిలీ.. పోస్టింగ్స్..

అమరావతి: ఏపీలో పలువురు ఐఏఎస్‌ అధికారులు బదిలీతో పాటు పోస్టింగ్స్ ఇచ్చారు. జీఎస్‌ఆర్కే విజయ్‌కుమార్‌‌కు మున్సిప‌ల్ శాఖ క‌మిష‌నర్‌తో పాటు ప్లానింగ్ కార్య‌ద‌ర్శి, సీఈవోగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్యత‌లు అప్పగించారు. అలాగే సుమిత్‌కుమార్‌కు ‌ఏపీ ఫైబ‌ర్ నెట్ ఎండీతో పాటు ప‌రిశ్ర‌మ‌లు, పెట్టుబ‌డులు, మౌళిక స‌దుపాయ‌ల కామ‌ర్స్ డిపార్ట్మెంట్ పూర్తిస్థాయి అద‌న‌పు బాధ్యత‌లతో పాటు ఇసుక బాధ్యత‌లు ప్ర‌త్యేకంగా అప్ప‌గించారు. ఎం. హరినారాయణ్‌కు సీసీయల్ స్పెష‌ల్ క‌మిష‌న‌ర్‌తో పాటు పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది శాఖ‌కు ప్ర‌త్యేక కార్య‌ద‌ర్శిగా పూర్తి స్థాయి అద‌న‌పు బాధ్యతలు, ప్ర‌త్యేకంగా గ్రామ‌ స‌చివాల‌యాలు, గ్రామ‌వలంటీర్స్ శిక్ష‌ణ బాధ్యతలు అప్పగించారు. వి.కోటేశ్వరమ్మకు ప్లానింగ్‌ డిపార్ట్‌మెంట్‌ డిప్యూటీ సెక్రటరీ బాధ్యతలు అప్పగించారు. సంజ‌య్ గుప్తాను పీసీసీయష్ కార్యాల‌యంలో రిపోర్ట్ చేయాల‌ని ప్ర‌భుత్వం ఆదేశించింది.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *