Breaking News
Home / States / ఆర్‌ఎంకు రవాణాశాఖ మంత్రి ఫోన్ కాల్…

ఆర్‌ఎంకు రవాణాశాఖ మంత్రి ఫోన్ కాల్…

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 3వేలకు పైగా బస్సులు నడుస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ సురేశ్‌ శర్మ వెల్లడించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 850 బస్సులకు గాను 330, ఉమ్మడి వరంగల్‌లో 797కు గాను 345, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 750కి గాను 164, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 624కు గాను 250 బస్సులు రోడ్డెక్కినట్టు ఆయన వివరించారు. అలాగే, ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లాలో 92, సంగారెడ్డి డిపో నుంచి 50శాతం బస్సులు నడుపుతున్నట్టు అధికారులు తెలిపారు. ప్రయాణీకులను గమ్యస్థానాలకు చేరవేసేందుకు పాఠశాల బస్సులకు సైతం అధికారులు అనుమతి ఇచ్చారు. మరోవైపు, ఆర్‌ఎం విజయభాస్కర్‌కు రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ ఫోన్‌ చేసి నడిపేందుకు ముందుకు రాని అద్దె బస్సులపై కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *