Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / మాజీ ఎంపీకి రవాణా శాఖ అధికారుల షాక్…

మాజీ ఎంపీకి రవాణా శాఖ అధికారుల షాక్…

అమరావతి: మాజీ ఎంపీ జేసీ దివాకర్‌ రెడ్డికి ఏపీ రవాణా అధికారులు షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్దంగా నడుస్తున్న 23 జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్ బస్సులను అధికారులు సీజ్ చేశారు. కమీషనర్ సీతారామాంజినేయులు, జాయింట్ కమీషనర్ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో భారీగా తనిఖీలు ,సోదాలు నిర్వహించారు. జేసీ దివాకర్ రెడ్డి ట్రావెల్స్‌కు చెందిన 23 ఇంటర్ స్టేట్ క్యారియల్ బస్సుల పర్మిట్లనూ రద్దు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, ఇష్టానుసారం టికెట్ల ధరలు వసూలు చేస్తున్నట్టు ఆర్టీఏ అధికారులు గుర్తించారు. నిబంధనలను అతిక్రమించినందుకు కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. దివాకర్ ట్రావెల్స్‌పై అనేక ఫిర్యాదులు వచ్చాయని, అందులో భాగంగానే తనిఖీలు చేశామని, విచారణ కొనసాగుతుందని రవాణా శాఖ జాయింట్ కమిషనర్‌ ప్రసాద్ రావు వెల్లడించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *