Breaking News
Home / States / Andhra Pradesh / రాజమండ్రిలో ఆర్ఎంపీల కలకలం..

రాజమండ్రిలో ఆర్ఎంపీల కలకలం..

కరోనా లక్షణాలున్న వారికి వైద్యం చేయొద్దని ప్రభుత్వం చెబుతున్నా వినకుండా.. రాజమండ్రి, కత్తిపూడిల్లో వైరస్ వ్యాప్తికి కారణమవుతున్నారు RMP డాక్టర్‌లు. లాక్‌డౌన్‌ను అవకాశంగా చేసుకుని క్లీనిక్‌లో రహస్య సేవలు అందిస్తున్నారు. పదేపదే వైద్యశాఖ హెచ్చరించినా సమాచారం ఇవ్వకుండా వైద్యం చేయడంతో.. కత్తిపూడిలో ఉపాధ్యాయుడు, రాజమండ్రిలో యువతికి RMPలు వైద్యం చేశారు. ఈ రెండు ఘటనల్లోని నిర్లక్ష్యంతో ఏకంగా 20 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. గ్రామాలు, పట్టణాల్లో ఆర్‌ఎంపీలు సొంత వైద్యం చేయవద్దని ప్రభుత్వం హెచ్చరించినా.. పలుచోట్ల ఆర్‌ఎంపీలు ప్రైవేటు క్లినిక్‌లు మూతపడడాన్ని అవకాశంగా మల్చుకుని పరిధి అతిక్రమించి వైద్యం చేసేస్తున్నారు.

జనం కూడా క్లినిక్‌లు లేవనే కారణంతో వీరినే ఆశ్రయిస్తున్నారు. ఇలా వచ్చే కేసుల్లో జ్వరం ఉన్న వారి వివరాలు ప్రభుత్వానికి అందించకుండా రహస్యంగా వైద్యం చేస్తున్నారు ఆర్‌ఎంపీలు. వారితో కాంటాక్ట్ అవడంతో.. సుమారు 80 మంది నుంచి శాంపిళ్లు తీసుకున్నారు.. వారి నుంచి ఎటువంటి రిపోర్టు వస్తుందోనని వైద్యశాఖ ఆందోళన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే తూర్పు గోదావరి జిల్లాలో 32 పాజిటివ్ కేసులు నమోదు అయ్యింది. ప్రస్తుతం వైరస్ కట్టడిలోనే ఉండగా.. RMPల నిర్వాకంతో కేసుల సంఖ్య పెరిగిపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *