ఢిల్లీ: నేడు సుప్రీంకోర్టులో అయోధ్య కేసుపై 40వ రోజు విచారణ జరగనుంది. ఇప్పటికే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వాదనల పూర్తికి నేటి సాయంత్రం వరకు గడువు విధించగా ఎదుటి పక్షాల వాదనలపై తుది వాదనలకు 45 నిమిషాల చొప్పున సమయం ఇచ్చారు. మొత్తం ఐదుగురు కక్షి దారులకు ఈ సమయం కేటాయించగా ముస్లిం కక్షి దారులకు గంట సమయం కేటాయించారు. వాదనలు పూర్తయిన తర్వాత తీర్పును రిజర్వ్ చేసే అవకాశం ఉండగా నేటితో ఈ కేసు విచారణ ముగిసే అవకాశం ఉంది.
