కురుపాం : కురుపాం మండలంలోని గోటివాడ పంచాయతీలో మడగిరిజన గ్రామానికి చెందిన అరిక అడ్డాయి అనే గిరిజనుడు, గురువారం సాయంత్రం కొండపోడు పనిచేసుకొని తిరిగి ఇంటికి వస్తుండగా వట్టిగెడ్డను దాటే ప్రయత్నం చేశాడు. ప్రమాదవశాత్తూ గెడ్డలో జారిపడి గిరిజనుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన శుక్రవారం వెలుగులోకి రావడంతో అతడి కోసం గ్రామస్థులంతా గాలిస్తున్నారు.
