Breaking News
Home / National / ట్రాయ్ కీలక నిర్ణయం…ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్..!

ట్రాయ్ కీలక నిర్ణయం…ఇకపై 11 అంకెల ఫోన్ నెంబర్..!

“ట్రాయ్” ( టెలికమ్ రెగులేటరీ అధారిటీ ఆఫ్ ఇండియా) మరో కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు సిఫార్సులు జారీ చేసింది. ప్రస్తుతం 10 అంకెలుగా ఉన్న మొబైల్ నెంబరు ను 11 అంకెలుగా మార్చాలని నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 9 వ నెంబరు తో ప్రారంభమయ్యే 10 నెంబర్ల మొబైల్ నెంబర్ స్థానంలో 11 నెంబర్లకు పెంచడం వలన 10 బిలియన్ ఫోన్ నెంబర్లు అందుబాటు లోకి వస్తాయని ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. ఈ మార్పు వల్ల దేశంలో సుమారు 7 వేల కోట్ల ఫోన్ కనెక్షన్ల వాడుకొనే వెసులుబాటు కలుగుతుంది. అయితే ఫిక్స్ డ్ లైన్ కనెక్షన్ నుంచి ఫోన్ చేయాలంటే మొబైల్ నెంబర్ కు ముందు సున్న ‘0’ ను ఉపయోగించాల్సి ఉంటుంది. అదే విధంగా, “డాంగల్స్” కు ప్రస్తుతం వాడే 10 నెంబర్ల స్థానంలో 13 నెంబర్లు వాడకానికి సిఫార్సు చేసింది. సాధ్యమైనంత త్వరలో “నేషనల్ నెంబరింగ్ ప్లాన్” ను జారీ చేయాలని సిఫార్సు చేసింది ట్రాయ్.

Check Also

త్వరలో ఇంటి సహాయకులు, ఆటోవాలాలు, రోజువారీ కూలీలకు కరోనా పరీక్షలు

Share this on WhatsAppదేశంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు పెరిగిపోతోంది. ఢిల్లీలో పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపధ్యంలో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *