Breaking News
Home / States / హుజుర్‌నగర్‌లో విజయభేరి మోగించిన కారు…

హుజుర్‌నగర్‌లో విజయభేరి మోగించిన కారు…

హైదరాబాద్: హుజుర్‌నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి గెలుపొందారు. ఆయన 43,624 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. ఆఖరి 22వ రౌండ్‌లో భారీ మెజార్టీతో గెలిచినట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు. సైదిరెడ్డి తొలి నుంచి ఆధిక్యం కనబరుస్తూనే వచ్చారు. సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఓట్ల లెక్కింపు జరుగుతుండగా మధ్యలోనే వెళ్లిపోయారు. హుజుర్‌నగర్‌లో ఇప్పటి వరకు 29,194 ఓట్ల మెజార్టీతో గెలవగా నేడు సైదిరెడ్డి 43,624 ఓట్ల మెజార్టీతో గెలిచి రికార్డును బ్రేక్ చేశారు. బీజేపీ, టీడీపీ అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *