Breaking News
Home / Politics / బీజేపీలో చేరనున్న టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

బీజేపీలో చేరనున్న టిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే

హైదరాబాద్: టీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ ఆదివారం సాయంత్రం బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే ఆయన చేరతారనే ఊహాగానాలు వినిపిస్తున్నా, ముహూర్తం మాత్రం ఇంకా ఖరారు కాలేదు. అయితే ఈ విషయమై చర్చించడానికి బీజేపీ ఎంపీలు ధర్మపురి అరవింద్, బండి సంజయ్ ఇప్పటికే రామగుండం చేరుకుని సోమారపుతో చర్చించనున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌లో తనకు సరైన గుర్తింపు లభించడం లేదని, కనీసం సభ్యత్వ నమోదు కార్యక్రమంలో తన మాట చెల్లుబాటు కావడం లేదని ఆరోపిస్తూ టీఆర్‌ఎస్ పార్టీకి సోమారపు రాజీనామా చేసిన విషయం తెలిసిందే.

Check Also

టీడీపీ పార్టీపై బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విమర్శలు…

Share this on WhatsAppఅమరావతి: గత టీడీపీ ప్రభుత్వాన్ని ప్రపంచ బ్యాంకు నమ్మలేదని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ఆరోపించారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *