Breaking News
Home / Crime / కూకట్‌పల్లిలో ఉద్రిక్తత.. సెటిలర్స్‌పై టీఆర్ఎస్ నాయకుల దాడి

కూకట్‌పల్లిలో ఉద్రిక్తత.. సెటిలర్స్‌పై టీఆర్ఎస్ నాయకుల దాడి

హైదరాబాద్: నగరంలోని కూకట్‌‌పల్లి నియోజకవర్గంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సెటిలర్స్‌‌ను కొందరు టీఆర్ఎస్ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నట్లు టీడీపీ నేతలు, కార్యకర్తలు పక్కా ఆధారాలతో సహా బయటపెట్టారు. వివరాల్లోకెళితే.. కూకట్‌పల్లిలోని సీబీఎన్ ఆర్మీ నాయకుడు బొల్లిన నాగేంద్ర ఇంట్లో ఉండగా టీఆర్ఎస్ నాయకులు దాడి చేసి గాయపరిచారు. సుమారు 25 మంది నాగేంద్ర ఇంట్లోకి చొరబడి, మందు బాటిల్స్ తీసుకువచ్చి రూమ్‌‌లో పెట్టి అనంతరం పోలీసులను తీసుకువచ్చి అరెస్ట్ చేయించారని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు.

కాగా.. ఈ వ్యవహారం మొత్తం కూకట్‌‌పల్లి టీఆర్ఎస్ అభ్యర్థి మాధవరం కృష్ణారావు తోడల్లుడు వాటర్ రవి (రవీంద్రారెడ్డి) ఆధ్వర్యంలో జరిగిందని టీడీపీ కార్యకర్తలు చెబుతున్నారు. ఈ దాడికి పాల్పడిన వారిలో కాంచనపల్లి నాగరాజు దుర్గరాజు (వివేక్‌నగర్) నక్కా జశ్వంత్ ఆరోగ్యా రెడ్డి, కరుణాకర్‌రెడ్డిగా గుర్తించినట్లుగా సీబీఎన్ ఆర్మీ చెబుతోంది. మరోవైపు.. తమపై కుట్ర పన్ని దాడికి పాల్పడటమే కాకుండా టీఆర్ఎస్ నాయకులు అక్రమ కేసులు బనాయిస్తున్నారని.. తక్షణమే వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని సీబీఎన్ ఆర్మీ డిమాండ్ చేస్తోంది. కాగా ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Check Also

మోటారు సైకిల్‌ దొంగల అరెస్టు

Share this on WhatsAppగుంటూరు: వ్యసనాలకు బానిసలుగా మారి ద్విచక్రవాహనాలను చోరీ చేస్తున్న ఇద్దరు దొంగలను గుంటూరు అర్బన్‌ సీసీఎస్‌ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *