Breaking News
Home / Politics / టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లే…

టీఆర్ఎస్ కు ఓటేస్తే అభివృద్ధికి ఓటేసినట్లే…

సూర్యాపేట : హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో భాగంగా నేరేడుచర్ల మండలం రామాపురంలో ఎమ్మెల్యే నరేందర్‌, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డి మాట్లాడుతూ.. హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌ విజయం ఖాయమైందన్నారు. మంచి మెజార్టీతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి గెలుస్తారన్నారు. హుజుర్‌నగర్‌ ఓటర్లంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. ప్రజలు ఉత్తమ్‌ మాటలను నమ్మడం లేదు. ఉత్తమ్‌ చేసిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు. ఉత్తమ్‌కి ఓటేస్తే ఉత్తగానే పోతాయని హుజుర్‌నగర్‌ ప్రజలు గ్రహించాలి. టీఆర్‌ఎస్‌కు ఓటేస్తే అభివృద్ధికి వేసినట్లే అని చెప్పారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *