Breaking News
Home / World News / ట్రంప్‌కు షాక్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం

ట్రంప్‌కు షాక్.. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌లో డెమొక్రాట్లకు ఆధిక్యం

వాషింగ్టన్: అమెరికా మధ్యంతర ఎన్నికల ఫలితాలు ఆసక్తికరమైన చర్చకు తెరలేపాయి. డెమొక్రాట్లు కాంగ్రెస్‌లోని ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌’లో ఆధిక్యం సాధించారు. అతి కష్టం మీద ‘సెనేట్’లో రిపబ్లికన్లు స్వల్ప ఆధిక్యాన్ని నిలబెట్టుకోగలిగారు. గడిచిన రెండు సంవత్సరాలుగా రెండు సభల్లోనూ మెజారిటీ కలిగిన ట్రంప్ సర్కార్ సునాయాసంగా పలు చట్టాలను రూపొందించగలిగింది. అయితే ‘ఒబామా కేర్’ వంటి ప్రతిష్టాత్మక హెల్త్ కేర్ పథకాన్ని తొలగించాలనే ట్రంప్ ప్రయత్నానికి సొంత పార్టీ ప్రతినిధుల నుంచి వ్యతిరేకత రావడంతో నానా ఇబ్బందులు ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. రెండు సభల్లోనూ ఆధిక్యత ఉన్న సమయంలో కూడా ఇబ్బందులు ఎదుర్కొన్న ట్రంప్ ప్రభుత్వానికి ‘హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్‌’లో డెమొక్రాట్ల పట్టుబిగించడం ట్రంప్‌కు ముచ్చెమటలు పట్టించడం ఖాయంగా కనిపిస్తోంది. అద్భుతమైన విజయమని ట్రంప్ పేర్కొంటున్నప్పటికీ ట్రంప్‌కు చుక్కలు కనిపించనున్నాయని, నరకం కనపడుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ట్రంప్ ఎదుర్కొనున్న కష్టాలు ఇవేనట..

  • డెమొక్రాట్ల సహాయం లేకుండా ట్రంప్ ప్రభుత్వం చట్టాలను రూపొందించడం అసాధ్యం.
  • వైట్‌హౌస్‌తోపాటు పలు కీలకమైన వ్యవహాలను పరిశీలించే అత్యంత శక్తివంతమైన కాంగ్రెస్‌ కమిటీల్లో డెమొక్రాట్లు తమ ప్రభాల్యాన్ని చూపించే అవకాశాలున్నాయి.
  • అధ్యక్షుడు ట్రంప్‌తోపాటు ఆయన సహాయకులపై విచారణ జరిపించవచ్చు. సాక్ష్యాలు, పత్రాలు, ఆధారాల కోసం కార్యానిర్వాహక సంస్థలు, అధికారులు, విభాగాలను డెమొక్రాట్లు కోరవచ్చు.
  • రహస్య పన్ను రాబడిని చెల్లించమని అధ్యక్షుడు ట్రంప్‌ను డెమొక్రాట్లు ఒత్తిడి చేయవచ్చు.
  • పలు కీలమైన వ్యవహారాలలో ట్రంప్‌కు బాసటగా నిలిస్తున్న ‘హౌస్ ఇంటెలిజెన్సీ కమిటీ’ చైర్మన్‌ ఆడం షీఫ్‌ వ్యవహారాలను డెమొక్రాట్లు నిశితంగా పరిశీలించవచ్చు. ప్రస్తుతం ఈ కమిటీకి చైర్మన్‌గా వ్యవహరిస్తున్న డెవిన్ నూన్స్.. ట్రంప్ వ్యవహారాలు, ముఖ్యంగా అధ్యక్ష ఎన్నికల్లో అవకతవకలు, రష్యా ప్రమేయం వంటి ఆరోపణలపై విచారణ విషయాల్లో ట్రంప్‌ను రక్షణాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఈ దర్యాప్తును డెమొక్రాట్లు ముమ్మరం చేయవచ్చు.
    అయితే ఈ పరిస్థిత ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కే కాదు. తాజా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు కూడా ఎదురైంది. ఒక సభలో మాత్రమే ఆధిక్యత ఉన్నప్పటికీ పలు చట్టాలను రూపొందించడానికి కృషి చేసిన ఒబామా విజయం సాధించారు. పలు కీలకమైన చట్టాలను రూపొందించారు.

Check Also

కాలిఫోర్నియా కార్చిచ్చు.. 50కి చేరిన మృతుల సంఖ్య

Share this on WhatsAppకాలిఫోర్నియా, యూఎస్ఏ: అమెరికాలోని కాలిఫోర్నియాలో చెలరేగిన కార్చిచ్చు ఆ రాష్ట్ర చరిత్రలో అతి పెద్దది. ఉత్తర, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *