Breaking News
Home / National / నిరుద్యోగ రేటుపై ట్రంప్ వ్యగ్యాస్త్రం…

నిరుద్యోగ రేటుపై ట్రంప్ వ్యగ్యాస్త్రం…

వాషింగ్టన్‌: అమెరికా సంయుక్త రాష్ట్రాలలో నిరుద్యోగ రేటు 50 ఏళ్ళ కనిష్టానికి తగ్గి, 3.5 శాతానికి చేరుకుంది. సెప్టెంబరు నెలలో చోటుచేసుకున్న 1,36,000 కొత్త ఉద్యోగాల కల్పన, దేశ ఆర్ధిక రంగానికి చేయూతనిచ్చింది. వరుసగా 19 నెలలుగా యుఎస్‌లో నిరుద్యోగ రేటు ఈ విధంగా నాలుగు శాతం కన్నా తక్కువగా ఉండటం సంభవించింది.

సెప్టెంబరు నెలలో సృష్టించబడిన ఉద్యోగాలే కాకుండా ఈ సంవత్సరం జులై, ఆగస్టు నెలలో 45,000 ఉద్యోగాలు కూడా ఇవ్వబడ్డాయని, యుఎస్‌ లేబర్‌ సెక్రటరీ యూజిన్ స్కాలియా ఒక ప్రకటనలో తెలిపారు. అంతే కాకుండా, 2017 సంవత్సరం నుండి ఇప్పటి వరకూ అరవై లక్షల ఉద్యోగాలు సృష్టించబడ్డాయని ఆమె వివరించారు. ఇక ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఈ విషయమై తనదైన వ్యంగ్య శైలిలో స్పందిస్తూ, ”బ్రేకింగ్‌ న్యూస్‌: నిరుద్యోగ రేటు 50 ఏళ్ళ తక్కువకు, 3.5 శాతానికి తగ్గింది; వావ్‌ అమెరికా… ప్రెసిడెంటును అభిశంసిద్దాం…(అతనే తప్పు చేయకపోయినా!)” అంటూ ట్విటర్‌లో పోస్టు పెట్టారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *