Breaking News
Home / Crime / రద్దయిన పాతనోట్లు మార్చే యత్నం

రద్దయిన పాతనోట్లు మార్చే యత్నం

ఏడుగురి అరెస్టు.. పరారీలో మహిళ
రూ. 1.11 కోట్ల నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం
హైదరాబాద్, బాలానగర్‌: రద్దయిన పాతనోట్లు మార్చేందుకు ప్రయత్నిస్తున్న ఏడుగురు వ్యక్తులను ఎస్‌వోటీ బాలానగర్‌ పోలీసులు పట్టుకున్నారు. కోటి పదకొండు లక్షల రూపాయల పాత కరెన్సీ, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాణి అనే మహిళ వద్ద పాత కరెన్సీ (రూ. 1000, 500 నోట్లు) ఉన్నట్టు వెస్ట్‌ మారేడ్‌పల్లికి చెందిన సామల అక్షయ్‌కుమార్‌(24)కు తెలిసింది. ఆమె నంబర్‌ సంపాదించి ఫోన్‌ చేశాడు. తనకు బ్యాంక్‌ అధికారులు తెలుసని, మార్పిస్తానని, కమీషన్‌ ఇవ్వమన్నాడు. నమ్మిన ఆమె కొద్దిరోజుల క్రితం నల్లకుంటలో ఓ ఆలయం వద్ద అతడికి కోటి 11 లక్షల రూపాయలు రద్దయిన పాత కరెన్సీ నోట్లు అందజేసింది. అక్షయ్‌కుమార్‌ తన మిత్రులైన నిజామాబాద్‌ బాన్సువాడకు చెందిన కులకర్ణి సుధాకర్‌(22), కాటేదాన్‌కు చెందిన చిగులుపల్లి వెంకటేశ్‌, వనస్థలిపురానికి చెందిన పూర గణేష్‌(31), జూబ్లీహిల్స్‌కు చెందిన అనుగుల కరుణాకర్‌(27), మెట్టుగూడ నివాసి బి. కిషోర్‌ రాఘవేంద్ర(34), బాలానగర్‌ రంగారెడ్డి నగర్‌కు చెందిన టి. అనిల్‌కుమార్‌(35)కు విషయం చెప్పాడు. అందరూ కలిసి వాటిని మార్చితే కమీషన్‌ వస్తుందని ఆశ చూపాడు. వారంతా ఆ నోట్లను మార్చే ప్రయత్నాలు ప్రారంభించారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగారెడ్డినగర్‌ వద్ద వారిని అదుపులోకి తీసుకొని నగదు, ఐదు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. వాణి పరారీలో ఉన్నట్టు తెలిసింది. నిందితులను రిమాండ్‌కు తరలించారు. వారిని మీడియా ఎదుట ప్రవేశపెట్టక పోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Check Also

భర్త అనుమానానికి బలైన భార్య

Share this on WhatsAppప్రకాశం: ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం తూర్పు గంగవరంలో భార్యపై అనుమానం పెంచుకున్న ఓ భర్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *