Breaking News
Home / National / మ్యాగీ తయారు చేయడానికి ప్రయత్నించి….

మ్యాగీ తయారు చేయడానికి ప్రయత్నించి….

కర్ణాటక: మ్యాగీ తయారు చేయడానికి చేసిన ప్రయత్నం బాలుడిని బలి తీసుకున్న ఘటన తుమకూరు పట్టణంలో చోటు చేసుకుంది. క్రిస్టియన్‌ స్ట్రీట్‌లో తల్లితండ్రులతో ఉంటున్న నోయల్‌ ప్రసాద్‌ (7) మ్యాగీ చేస్తానంటూ తల్లిని ఒప్పించి కిచెన్‌లో గ్యాస్‌ స్టవ్‌ వెలిగించడానికి ప్రయత్నించాడు. అయితే అప్పటికే గ్యాస్‌ లీక్‌ కావడంతో లైటర్‌ వెలిగిస్తున్న క్రమంలో నిప్పు రవ్వలు అంటుకొని మంటలు వ్యాపించాయి. ఘటనలో నోయల్‌కు తీవ్రగాయాలు కావడంతో తల్లితండ్రులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. వైద్యులు వెంటనే చికిత్స ప్రారంభించినా తీవ్రగాయాలు కావడంతో చికిత్స ఫలించక నోయల్‌ మృతి చెందాడు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *