Breaking News
Home / States / Andhra Pradesh / సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ…

సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ…

తిరుపతి : సెల్ఫీ తీసుకుంటూ.. ప్రమాదవశాత్తూ తెలుగు గంగ కాలువలో జారిపడి యువకుడు గల్లంతైన ఘటన మంగళవారం ఉబ్బలమడుగులో చోటు చేసుకుంది. ఉబ్బలమడుగు పర్యాటక కేంద్రాన్ని సందర్శించడానికి కొందరు యువకులు ఈరోజు ఉదయం వెళ్లారు. పర్యాటక కేంద్రానికి ముందుగా సమీపాన ఉన్న తెలుగు గంగ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో… చెన్నైకి చెందిన మహేష్‌ (24) కాలువ దగ్గరగా నిలబడి సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ.. కాలుజారి కాలువలో పడటంతో గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. స్థానికంగా ఉన్న గజ ఈతగాళ్లతో యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కాలువ ఉధృతి వేగంగా ఉందని, గాలించడం కష్టంగా ఉందని గజ ఈతగాళ్లు తెలుపుతున్నారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *