తిరుపతి: టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. తమిళనాడులోని 23చోట్ల ఉన్న శ్రీవారి ఆస్తులను విక్రయించేందుకు రంగం సిద్ధమైంది. ఆస్తుల విక్రయం కోసం టీటీడీ పాలక మండలిలోనే తీర్మానం జరిగింది. దీని కోసం 8 కమిటీలు ఏర్పాటు చేశారు. టీమ్ ఏ, బీ విభాగాలుగా కమిటీలు ఏర్పాటు చేశారు. ఆస్తుల విక్రయానికి బహిరంగ వేలం నిర్వహించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ఆస్తులను రిజిస్ట్రేషన్ చేసే అధికారాలను టీటీడీ అధికారులకు కట్టబెట్టారు. టీటీడీ ఆస్తులను తమ వారికి కట్టబెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణం ఆస్తుల విక్రయాన్ని నిలిపివేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.
