Breaking News
Home / States / Andhra Pradesh / 8 నుంచి పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం

8 నుంచి పసుపు కొనుగోళ్లు పునఃప్రారంభం

నెల్లూరు: ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఉదయగిరి పసుపు కోనుగోలు కేంద్రాన్ని 8 నుంచి పునఃప్రారంభిస్తామని మార్క్‌ఫెడ్‌ జిల్లా మేనేజర్‌ సుజాత పేర్కొన్నారు. శుక్రవారం ఆంధ్రజోతిలో పసుపు అమ్మేదెలా అన్న శీర్షిక ప్రచురితం కావడంతో ఆమె స్పందించారు. ఉదయగిరి వ్యవసాయ మార్కెట్‌ యార్డును పరిశీలించారు. ఈ కర్షక్‌లో నమోదైన 171 మందితో పాటు, వ్యవసాయాధికారులు ధ్రువీకరించిన 152 మంది రైతుల వివరాలను జేసీకి, మార్క్‌ఫెడ్‌ ఎండీకి నివేదిక పంపుతామన్నారు. ఆమె వెంట ఏడీఏ సత్యనారాయణచౌదరి, ఏవో చెన్నారెడ్డి ఉన్నారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *