హైదరాబాద్: తెలంగాణ విద్యా వేదిక (టీవీవీ) అధ్యక్షుడు మద్దిలేటిని పోలీసులు అరెస్టు చేశారు. ఆయనతోపాటు టీపీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణను సైతం పోలీసులు అరెస్టు చేసి గద్వాల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బాగ్ లింగంపల్లిలోని ప్రజాఫ్రంట్ కార్యాలయం వద్ద వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్‌లో కొద్ది మంది టీవీవీ విద్యార్థులను మావోయిస్టుల్లో చేర్పించారని మద్దిలేటిపై పోలీసులు ఆరోపిస్తున్నారు. మావోయిస్టులకు వీరిద్దరూ డబ్బులు సరఫరా చేస్తున్నారని అనుమానిస్తున్నారు. అంతేకాకుండా కొంతకాలంగా సెంట్రల్ కమిటీకి చెందిన తెలంగాణ నేతలను కలుస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. మద్దిలేటి ఇంట్లో జరిపిన సోదాల్లో అందుకు సంబంధించిన లేఖలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరితోపాటు మరో ఇద్దరు వ్యక్తులు నాగన్న, బలరాంపైనా కేసు నమోదు చేసి వాళ్లను కోర్టులో హాజరుపరిచారు.