Breaking News
Home / National / ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ సేవలకు అంతరాయం…

ప్రపంచ వ్యాప్తంగా ట్విటర్ సేవలకు అంతరాయం…

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ నెట్వర్కింగ్  సైట్ ట్విట్టర్ సేవలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఉదయం నుంచి ట్విట్టర్ నిలిచిపోయింది. లాగిన్ అయితే ఎర్రర్ మెసేజ్ వస్తోంది. దీనిపై ట్విట్టర్ నుంచి వివరణ వచ్చింది. లోపం ఎక్కడుందో కనుక్కుని, దాన్ని పరిష్కరించే పనిలో తమ నిపుణులు ప్రయత్నిస్తున్నారని, త్వరలోనే సాధారణ స్థితి నెలకొంటుందని ట్విట్టర్ వర్గాలు పేర్కొన్నాయి. ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ కాలేకపోతున్నామంటూ ప్రపంచవ్యాప్తంగా 4000కి పైగా రిపోర్టులు ట్విట్టర్ వర్గాలను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ముఖ్యంగా, జపాన్, కెనడా, భారత్ నుంచి ఎక్కువ ఫిర్యాదులు వెళ్లినట్టు తెలుస్తోంది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *