Breaking News
Home / National / ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

ఉగ్రవాదుల కాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లోని అవంతిపురా రీజియన్‌లో మంగళవారం ఉదయం భద్రతా బలగాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఇద్దరు ఉగ్రవాదులను బలగాలు మట్టుబెట్టాయి. ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారో తెలియాల్సి ఉంది. అయితే అవంతిపురాలోని సత్‌పోక్రాన్‌ ఖ్రేవ్‌ ఏరియాలో ఉగ్రవాదులు సంచరిస్తున్నట్లు పోలీసులకు పక్కా సమాచారం అందింది. దీంతో సీఆర్పీఎఫ్‌, రాష్ట్రీయ రైఫిల్స్‌, జమ్మూకశ్మీర్‌ పోలీసులు కలిసి సంయుక్తంగా కూంబింగ్‌ నిర్వహించారు. ఈ క్రమంలో ఉగ్రవాదులు బలగాలకు తారసపడ్డారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *