నల్గొండ: కేతేపల్లి మండలం చీకటిగూడెంలో డీసీఎం వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడడంతో ప్రమాదం చోటుచేసుకుంది. డీసీఎం తొట్టిలో మొక్కలపై నిద్రిస్తున్న నర్సరీ లేబర్స్ నాగేశ్వర్, రాములు అనే వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందగా డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు నర్సరీ మొక్కలు తీసుకొస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
