Breaking News
Home / States / హైదరాబాద్ లో రెండు దోపిడీ ముఠాలు అరెస్ట్….

హైదరాబాద్ లో రెండు దోపిడీ ముఠాలు అరెస్ట్….

హైదరాబాద్: హైదరాబాద్‌ మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతానికి చెందిన అక్బరుద్దీన్‌ ఫారూఖ్‌ స్నేహితులు మహ్మద్‌ మోసిన్‌, మహ్మద్‌ ఖద్దీర్‌, షానవాజ్‌ అలీతో కలిసి రెండు ముఠాలను ఏర్పాటు చేశారు. ఇద్దరు సభ్యులతో ఒక ముఠాగా ఏర్పడి అర్ధరాత్రి సమయాల్లో హైదరాబాద్‌ రోడ్ల మీద తిరుగుతూ ఒంటరిగా వెళ్లే వారిని టార్గెట్‌ చేసి కత్తి చూపించి మొబైల్‌ ఫోన్‌తో పాటు నగదును దోచుకుంటారు. ఈ రెండు ముఠాలు బహదూర్‌పురా, ఫలక్‌నుమా, మొఘల్‌పురా పోలీస్‌స్టేషన్‌ల పరిధిలో పలు దోపిడీలకు పాల్పడ్డారు. వీరి అరెస్ట్‌తో మొత్తం 5 కేసుల మిస్టరీ వీడిపోయింది. 5 మొబైల్‌ ఫోన్‌ లు, రెండు బైక్‌లు, డాగర్‌ను స్వాధీనం చేసుకున్నారు. విచారణలో అక్బరుద్దీన్‌ ఫారూఖ్‌పై 11, మహ్మద్‌ మోసిన్‌పై 10 కేసులు, మహ్మ ద్‌ ఖాద్దీర్‌పై 4, ఫానవాజ్‌ అలీపై 2 పాత కేసులు ఉన్నట్లు తేలింది. అరస్టైన వీరిని తదుపరి విచారణ కోసం ఫలక్‌నుమా పోలీస్‌ స్టేషన్‌ అధికారులకు అప్పగించారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *