విశాఖ: ఆర్కే బీచ్‌లో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. స్థానిక కంచరపాలం ఐటీ జంక్షన్‌కు చెందిన ఐదుగురు విద్యార్థులు సముద్ర స్నానానికి వెళ్లారు. అలలు ఉధృతంగా వస్తుండటంతో.. కాసేపటికే ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరు మాత్రం గల్లంతయ్యారు. కోస్టుగార్డులకు సమాచారం ఇవ్వగా వారికోసం గాలింపు చేపట్టారు. అయినప్పటికీ ఎలాంటి లాభం లేకుండా పోయింది. చీకటి పడటంతో గాలింపు చర్యలను నిలిపివేశారు. అయితే ఈరోజు భరత్ అనే విద్యార్థి డెడ్ బాడీ ఒడ్డుకు కొట్టుకు రావడంతో మృతదేహాన్ని కేజీహెచ్‌కు తరలించారు. మరో విద్యార్థి మోహిత్ కోసం గాలింపు చేపట్టారు.
