Breaking News
Home / States / నోట్లరద్దు అయిన రెండేళ్ల తర్వాత…మోదీ రాష్ట్రంలో రూ.3.5 కోట్ల సీజ్

నోట్లరద్దు అయిన రెండేళ్ల తర్వాత…మోదీ రాష్ట్రంలో రూ.3.5 కోట్ల సీజ్

అహ్మదాబాద్ : దేశంలో పెద్ద నోట్ల రద్దు అయిన రెండేళ్ల తర్వాత సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లో రూ.3.5 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్ రాష్ట్రంలోని బిలిమోరా గ్రామంలో ఉంచిన రూ.3.5కోట్ల నగదును స్వాధీనం చేసుకొని నలుగురు నిందితులను అరెస్టు చేశామని గుజరాత్ లోకల్ క్రైంబ్రాంచ్ పోలీసు అధికారి శైలేష్ గిరి గోస్వామి చెప్పారు. పోలీసులు 13,432 వెయ్యిరూపాయల పాత నోట్లు,రూ.500ల విలువగల 43,300 నోట్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు ప్రకటించారు. దేశంలో 2016 నవంబరు 8వతేదీన పెద్దనోట్లను కేంద్రం రద్దు చేసింది. అనంతరం నోట్ల మార్పిడికి కొంత సమయం ఇచ్చినా ఈ నోట్లను మార్పిడి చేసుకోలేదని తేలింది. ప్రధాని సొంత రాష్ట్రంలోనే ఇంత పెద్ద ఎత్తున పాత నోట్లను స్వాధీనం చేసుకోవడం సంచలనం రేపింది.

Check Also

మాదాపూర్‌ లేడీస్ హాస్టల్‌లో యువతి ఆత్మహత్య

Share this on WhatsAppహైదరాబాద్: నగరంలోని మాదాపూర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలోని …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *