Breaking News
Home / States / విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

విషాదం.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల దుర్మరణం

ఎదురెదురుగా ఢీ కొన్న బస్సు, ద్విచక్రవాహనం
అశ్వారావుపేట మండలంలో ఘటన
అశ్వారావుపేట(భద్రాద్రి కొత్తగూడెం): అశ్వారావుపేట మండలంలో శనివారం ద్విచక్రవాహనాన్ని బస్సు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు యువకులు మృతి చెందారు. మండలంలోని రామన్నగూడెం గ్రామానికి చెందిన ఎం. పాపారావు(25), దుర్గారావు(22) అనే యువకులు ద్విచక్ర వాహనంపై అశ్వారావుపేట వచ్చి వినాయకపురం వైపునకు వెళుతున్నారు. వినాయకపురం ముత్యాలమ్మ ఆలయ సమీపంలో భద్రాచలం నుంచి రాజమండ్రి వైపునకు వెళుతున్న ఆర్టీసీ బస్సు, యువకులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు సంఘటన స్థలంలోనే మృతిచెందారు. మృతులిద్దరూ వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. సంఘటన స్థలాన్ని అశ్వారావుపేట సీఐ అబ్బయ్య సందర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Check Also

వైఎస్‌ జగన్-కేటీఆర్‌ భేటీపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

Share this on WhatsAppఅమరావతి: లాంగ్ గ్యాప్ తర్వాత.. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు, క్రైస్తవ మతబోధకుడు కేఏ పాల్ మీడియా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *