Breaking News
Home / National / జపాన్ లో టైపూన్ హగిబీస్..

జపాన్ లో టైపూన్ హగిబీస్..

టోక్యో (జపాన్) : జపాన్ దేశాన్ని ‘టైఫూన్ హగిబీస్’ తుపాన్ ముంచెత్తడంతో 72 మంది మృత్యువాత పడ్డారు. జపాన్ దేశాన్ని కుదిపేసిన ఈ తుపాన్ ప్రభావం వల్ల 9,962 ఇళ్లు వరదనీటిలో మునిగిపోయాయి. భారీవర్షాల వల్ల జపాన్ దేశంలో వెల్లువెత్తిన వరదలతో పలు ప్రాంతాలు ముంపునకు గురయ్యాయి. ముంపు ప్రాంతాల నుంచి 2,30,000 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాన్ విపత్తు వల్ల 72 మంది మరణించడంతోపాటు రవాణ, పర్యాటక రంగాలకు భారీనష్టం వాటిల్లింది. తుపాన్ సహాయ పనులు చేపట్టేందుకు 1,10,000 మంది అగ్నిమాపకశాఖ అధికారులు, పోలీసు, సెల్ఫ్ డిఫెన్స్ బలగాలను వరద ముంపు ప్రాంతాలకు పంపించారు. 110 హెలికాప్టర్లను రంగంలోకి దించి తుపాన్ సహాయ పునరావాస పనులు చేపట్టామని జపాన్ చీఫ్ కేబినెట్ సెక్రటరీ  చెప్పారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *