Breaking News
Home / Lifestyle / Business / భారీ ప్రీమియంతో మార్కెట్లోకి ఉజ్జీవన్‌

భారీ ప్రీమియంతో మార్కెట్లోకి ఉజ్జీవన్‌

ముంబయి: ఉజ్జీవన్‌ స్మాల్‌ఫైనాన్స్‌ బ్యాంక్‌ నేడు భారీ ప్రీమియంతో మార్కెట్లలో నమోదైంది. లిస్టింగ్‌సమయంలో ఈ షేరు ధర రూ.58గా పలికింది. అంటే ఐపీవోలో కేటాయించిన రేటు కంటే 57శాతం అధికమన్నమాట. ఇష్యూలో దీనిని రూ.37కు కేటాయించారు. ఒక దశలో ఈ షేరు రూ.62.08కి కూడా చేరింది. రూ.750 కోట్లను సమీకరించేందుకు ఐపీవోకు వచ్చిన ఈ సంస్థకు రూ.76వేల కోట్లకు బిడ్లు రావడం విశేషం. అంటే దాదాపు 160 రెట్లకు పైమాటే. 2018 నుంచి వచ్చిన అన్ని ఐపీవోల్లోకి ఇదే అత్యధికంగా బిడ్లను దక్కించుకొంది. ఈ ఐపీవోలో 12.4 కోట్ల షేర్లను విక్రయించాలని సంస్థ భావించగా.. 20,538 మిలియన్ల షేర్లకు డిమాండ్‌ వచ్చింది.

జనవరి 2020. ఉజ్జీవన్‌ ఎక్స్ఛేంజీలకు రావడానికి ఆర్‌బీఐ పెట్టిన గడువు తేదీ ఇది. కార్యకలాపాలు మొదలుపెట్టిన మూడేళ్లలో స్టాక్‌ఎక్సేం జీల్లో లిస్టవ్వాలని.. లైసెన్సులు జారీ చేసే సమయంలో ఆర్‌బీఐ షరతు పెట్టింది. దాని ప్రకారమే ఐపీఓకు వచ్చింది. మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది.

ఎందుకింత స్పందన ఇదే తరహా వ్యాపారం చేస్తున్న ఇతర బ్యాంకుల షేర్లు అధిక విలువల వద్ద ఉండడంతో ఈ బ్యాంకు ఐపీఓ ఆకర్షణీయంగా కనిపించింది. అదీకాక బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు ఇతర చిన్న బ్యాంకులతో పోలిస్తే చాలా తక్కువ. స్థూల అడ్వాన్సుల్లో ఇవి 0.85 శాతమే. భవిష్యత్‌లో మరింత వృద్ధికి అవకాశం ఉందన్న అంచనాలు ఎమ్‌ఎఫ్‌ఐయేతర రుణాలు పెరుగుతుండడం.. ఇవన్నీ నికర వడ్డీ మార్జిన్లు పెరిగేలా చేస్తాయన్న విశ్వాసాన్ని కలగజేశాయి.

Check Also

భారత్‌లో వివో డిజైన్‌ సెంటర్‌

Share this on WhatsApp50,000కు పెరగనున్న ఉద్యోగుల సంఖ్య ప్రీమియం సెగ్మెంట్‌లో ఎక్స్‌50 స్మార్ట్‌ఫోన్ల ఆవిష్కరణ ధర రూ. 34,990 …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *