Breaking News
Home / World News / అమెరికాలో జరిగిన ఊహించని ప్రమాదం…..

అమెరికాలో జరిగిన ఊహించని ప్రమాదం…..

పిట్స్‌బర్గ్‌: అమెరికాలోని పిట్స్‌బర్గ్‌ సిటీలో కొన్ని రోజులుగా కురిసిన వర్షాలతో అక్కడి రోడ్లలో తరచూ గుంతలు ఏర్పడుతున్నాయి. సోమవారం ఉదయం కూడా రద్దీ ఎక్కువగా ఉన్న సమయంలో పిట్స్‌బర్గ్‌ జంక్షన్‌ వద్దకు రాగానే రెడ్‌ సిగ్నల్‌ పడడంతో ఒక బస్సు వచ్చి ఆగింది. గ్రీన్‌ సిగ్నల్‌ పడగానే బస్సును ముందుకు తీసేందుకు ప్రయత్నిస్తుండగా ఒక్కసారిగా భూమి కుంగిపోయి సుమారు పది అడుగుల మేర భారీ గుంత ఏర్పడి దాదాపు సగం బస్సు ఆ గుంతలో కూరుకుపోయింది. అయితే ఆ సమయంలో బస్సు డ్రైవర్‌తో పాటు కేవలం ఒక పాసింజర్‌ మాత్రమే ఉండడంతో వారిద్దరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. అయితే బస్సు వెనకే వచ్చిన ఒక కారు ముందుభాగం కూడా ఆ గుంతలో కూరుకుపోయింది. వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గుంతలో పడిన బస్సును ప్రొక్లెయినర్‌తో బయటికి తీశారు.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *