Breaking News
Home / National / విమానంలో ఇస్రో చైర్మన్‌కు ఊహించని అనుభవం..

విమానంలో ఇస్రో చైర్మన్‌కు ఊహించని అనుభవం..

న్యూఢిల్లీ: చంద్రయాన్-2 ప్రయోగంతో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) దేశ ప్రజలకు ఎంత చేరువైందో చెప్పేందుకు అచ్చమైన నిదర్శనమిది.. ఓ విమానంలో వెళ్లేందుకు వచ్చిన ఇస్రో చైర్మన్‌ కే. శివన్‌కు అందులోని ప్రయాణికులంతా అపూర్వ స్వాగతం పలికారు. కేరింతలు, కరతాళ ధ్వనులు, సెల్ఫీల మధ్య ఊహించని ఈ పరిణామానికి శివన్ సంతోషంతో ఉప్పొంగిపోయారు. ఈ దృశ్యాన్ని ఓ ఔత్సాహికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇస్రో చైర్మన్‌ అంతటి వ్యక్తి ఎకానమి క్లాసులో తమ మధ్య ప్రయాణించడంతో ప్రయాణికులంతా ఆశ్చర్యానికి గురయ్యారు. విమాన సిబ్బందితో పాటు పలువురు ప్రయాణికులు ఆయనతో సెల్ఫీలు దిగేందుకు పోటీపడ్డారు. అందరితోనూ ఓపిగ్గా సెల్ఫీలు దిగుతూ, అభివాదం చేస్తూ తన నిరాడంబరత, అణుకువతో శివన్ మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు.

మరోవైపు ఈ వీడియో చూసిన నెటిజన్లు సైతం ఇస్రో చైర్మన్ శివన్‌పై తమ అభిమానం చాటుకుంటున్నారు. ‘‘ఇస్రో చైర్మన్‌కు ఎంతటి ఆత్మీయ స్వాగతం.. హర్షాతిరేకాలతో గర్వించదగిన సమయం ఇది..’’ అని ఓ నెటిజన్ పేర్కొనగా.. ‘‘సినిమాలు, క్రికెట్‌కు సంబంధం లేని ఓ వ్యక్తిని ఇంతలా గుర్తించడం నిజంగా గ్రేట్…’’ అంటూ మరో నెటిజన్ సంతోషం పంచుకున్నాడు. గత నెలలో చంద్రయాన్-2కి చెందిన విక్రమ్ ల్యాండర్‌ ఇస్రోతో సంబంధాలు కోల్పోయిందన్న వార్త తెలియగానే సగటు భారతీయుడి గుండె పగిలినంత పనైంది. తీవ్ర భావోద్వేగంతో కంటతడి పెట్టిన శివన్‌ను ప్రధాని మోదీ అక్కున చేర్చుకుని ఓదార్చారు. భారత్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-2 ప్రయోగం కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఎంత కష్టపడ్డారో చెప్పడానికి ఈ ఒక్క సంఘటన చాలు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *