నిజామాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ బంద్ నేపథ్యంలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ప్రభుత్వం కొన్ని బస్సులను పోలీసుల సాయంతో నడిపిస్తోంది. నిజామాబాద్ జిల్లా కేంద్రం శివారులో ఈ రోజు ఉదయం ఎక్స్ప్రెస్ బస్సుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. నిజామాబాద్ నుంచి వరంగల్ వెళుతుండగా ఓ ఫ్యాక్టరీ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు వెనుక నుంచి రాయితో కొట్టడంతో బస్సు వెనుక గ్లాస్ డామేజ్ అయి ప్రయాణికుడి తలకి స్వల్ప గాయమైంది.
