Breaking News
Home / States / Andhra Pradesh / గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న రూపాల….

గాంధీజీ సంకల్పయాత్రలో పాల్గొన్న రూపాల….

ప్రకాశం: బుధవారం ఒంగోలులో బీజేపీ నిర్వహించిన గాంధీజీ సంకల్పయాత్రలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి పురుషోత్తం రూపాల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శనగ రైతులకు గిట్టుబాటు ధరలు, పంట భీమా అమలు విషయంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించి రైతులకు న్యాయం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని, మహాత్మాగాంధీ 150వ జన్మదినోత్సవాల సందర్భంగా ఆయన ఆశయాలను సాధించేందుకు బీజేపీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహాత్మాగాంధీ సత్య, అహింసా విధానాలను అనుసరిస్తూ బ్రిటీష్‌ పాలకులపై పోరాడారని, శాంతియుతంగా కూడా రాజ్యాలపై యుద్ధం చేయవచ్చని గాంధీజీ నిరూపించారని రూపాల కొనియాడారు. ఈ కార్యకర్రమంలో రాజ్యసభ సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు, స్థానిక నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంతకుముందు పురుషోత్తం రూపాల నగరంలోని గాంధీరోడ్డులో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

Check Also

నరసరావుపేటలో రేపటి నుంచి సంపూర్ణ లాక్‌డౌన్

Share this on WhatsAppనరసరావుపేట: గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలో శనివారం నుంచి సంపూర్ణ లాక్‌డౌన్‌ను అమలు చేస్తున్నట్లు ఆర్డీవో ఎం.వెంకటేశ్వర్లు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *