Breaking News
Home / National / రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధానికే దక్కాలి…

రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధానికే దక్కాలి…

ప్యారిస్‌: దసరా పర్వదినాన్ని పురస్కరించుకొని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంగళవారం ఫ్రాన్స్‌లో డసో ఏవియేషన్‌ సంస్థ నుంచి అత్యాధునిక యుద్ధ విమానం రఫేల్‌ని స్వీకరించి ఆయుధపూజ నిర్వహించి అనంతరం రఫేల్‌ జెట్‌లో దాదాపు 25నిమిషాల పాటు చక్కర్లు కొట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక ఆయుధాలు సమకూర్చుకొని ఏ దేశాన్నీ భయపెట్టే ఉద్దేశం భారత్‌కు లేదని, కేవలం రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యమని అన్నారు. రఫేల్‌లో విహరించడం సౌకర్యంగా ఉందని అభిప్రాయపడ్డారు. జీవితంలో ఇలాంటి క్షణాలు ఒక్కసారే వస్తాయంటూ తన అనుభూతిని పంచుకుంటూ సూపర్‌సోనిక్‌ వేగంతో ప్రయాణిస్తానని కలలో కూడా ఊహించలేదన్నారు. రఫేల్‌ రాకతో దేశ భద్రత మరింత పటిష్ఠమవుతుందన్నారు. ఫిబ్రవరి 2021 నాటికి మరో 18 రఫేల్‌ యుద్ధ విమానాలు, మే 2022 నాటికి మొత్తం 36 జెట్లు భారత అమ్ములపొదిలో చేరతాయన్నారు. రఫేల్‌ జెట్ల చేరిక ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి దక్కాల్సిన అవసరం ఉందన్నారు. ఆయన సాహసోపేతమైన నిర్ణయాలు దేశ భద్రతకు లబ్ధి చేకూరుస్తున్నాయని అభిప్రాయపడ్డారు.

అంతకు ముందు రఫేల్‌ విమానాన్ని రాజ్‌నాథ్‌ క్షుణ్నంగా పరిశీలించారు. రఫేల్‌ భారత్‌ చేతికి అందిన రోజు భారత వైమానిక దళానికి చరిత్రాత్మకమైన దినంగా నిలిచిపోతుందన్నారు. అనంతరం ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్‌ మెక్రాన్‌తో సమావేశమై రఫేల్‌ అప్పగింతతో భారత్‌, ఫ్రాన్స్‌ బంధంలో సరికొత్త అధ్యాయం మొదలైందని, అనుకున్న సమయానికి రఫేల్‌ యుద్ధవిమానాలు అందడం సంతోషంగా ఉందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *