Breaking News
Home / National / ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రమంత్రి…

ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేంద్రమంత్రి…

ముంబై : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన కేంద్ర రోడ్డు, రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి ముంబై ట్రాఫిక్ పోలీసులు విధించిన జరిమానాను చెల్లించిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నితిన్ గడ్కరీ ఇటీవల మోటారు వాహనాల చట్టంలో మార్పులు తీసుకువచ్చి, ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించిన కారు యజమానులు, డ్రైవర్లకు భారీ జరిమానాలు వడ్డిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు భారీ జరిమానాలు విధించామని మంత్రి ప్రకటించారు. మంత్రి అమలు చేస్తున్న చట్టం ప్రకారం సాక్షాత్తూ మంత్రి కారుకే జరిమానాను చెల్లించారు. ‘

‘నేను ఢిల్లీలో ఉన్న సమయంలో… నా కారు డ్రైవరు ముంబైలోని వర్లీ-బాండ్రా సీ లింక్ మార్గంలో ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించి వేగంగా నడిపారు. నా కారు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి వేగంగా పోవడం రోడ్డుపై ఉన్న కెమెరాల్లో నమోదైంది. దీంతో ట్రాఫిక్ పోలీసులు అధిక వేగంతో కారు నడిపినందుకు జరిమానా విధించారు. వెంటనే నేను జరిమానా మొత్తాన్ని చెల్లించాను” అని నితిన్ గడ్కరీ చెప్పారు. ఎందరో రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్న నేపథ్యంలో వీటిని అరికట్టేందుకే అధిక జరిమానాలు విధించేలా చట్టంలో మార్పులు తీసుకువచ్చామని మంత్రి పేర్కొన్నారు. తాము ప్రభుత్వ ఆదాయం పెంచుకునేందుకు ఈ భారీ జరిమానాలు విధించడం లేదని, కేవలం రోడ్డు ప్రమాదాల సంఖ్యను తగ్గించేందుకు అధిక జరిమానాలు వేస్తున్నామని నితిన్ గడ్కరీ వివరించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *