Breaking News
Home / National / చెట్ల నరికివేతను సమర్థించిన కేంద్ర మంత్రి

చెట్ల నరికివేతను సమర్థించిన కేంద్ర మంత్రి

ముంబై: ముంబైలోని ఆరే కాలనీలో చెట్లను నరికివేస్తున్నారు. మెట్రో కారు పార్కింగ్ కోసం అధికారులు కొన్ని వేల వృక్షాలను తొలగించేందుకు ప్రక్రియ మొదలుపెట్టారు. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతున్నది. అయితే కేంద్ర మంత్రి జవదేకర్ మాత్రం చెట్ల నరికివేతను సమర్థించారు. అభివృద్ధి, పర్యావరణ సమతులత్య ఒకే రీతిలో సాగాలన్నారు. ఢిల్లీలో తొలిసారి మెట్రోస్టేషన్ కోసం 25 చెట్లను నరికేశారని, అప్పుడు కూడా నిరసనలు వెల్లువెత్తాయని, కానీ ఇప్పుడు అక్కడ అటవీ శాతం పెరిగిందన్నారు. ఆరే కాలనీలో సుమారు 2500 చెట్లను తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఇవాళ ఆరే కాలనీలో 144 సెక్షన్ విధించారు. కొందరు కార్యకర్తలను అరెస్టు చేశారు. ప్రస్తుతం ముంబైలో పరిస్థితి ఉద్రిక్తంగా ఉన్నది. ఆరే అటవీ ప్రాంతం కాదని బాంబే హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసిందన్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *