Breaking News
Home / States / సంకల్ప్ యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి….

సంకల్ప్ యాత్రను ప్రారంభించిన కేంద్రమంత్రి….

హైదరాబాద్: ప్రపంచంలోనే శక్తిమంతమైన, అవినీతి రహిత దేశంగా భారత్‌ను నిర్మించుకోవాల్సిన అవసరం ఉందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నగరంలోని ఖైరతాబాద్ గణేష్ చౌక్ వద్ద ‘గాంధీ సంకల్ప్‌’ యాత్రను కిషన్ రెడ్డి ప్రారంభించారు. ప్లాస్టిక్‌ను వాడబోమంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మహాత్ముడి స్ఫూర్తితో ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో ఈ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. 150 కి.మీ. వరకు సాగే ఈ పాదయాత్రలో ప్లాస్టిక్ నిషేధం, స్వచ్ఛ భారత్‌పై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని కిషన్ రెడ్డి తెలిపారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *