Breaking News
Home / National / ఉన్నావో అత్యాచార బాధితురాలు మృతి….

ఉన్నావో అత్యాచార బాధితురాలు మృతి….

న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావోకు చెందిన అత్యాచార బాధితురాలు కన్నుమూసింది. 90 శాతం కాలిన గాయాలతో ఆసుపత్రిలో చేరిన ఆమె పరిస్థితి విషమించడంతో కన్నుమూసినట్టు వైద్యులు తెలిపారు. గతేడాది డిసెంబరులో బాధితురాలు అత్యాచారానికి గురైంది. పెళ్లి పేరుతో ఆమెను నమ్మించిన నిందితుడు స్నేహితులతో కలిసి అత్యాచారానికి పాల్పడ్డాడు. అప్పట్లో ఈ కేసులో అరెస్ట్ అయిన నిందితుడు గత నెల 25న విడుదలయ్యాడు. బయటకు వచ్చిన నిందితుడు తనను జైలుకు పంపిన ఆమెపై కక్ష పెంచుకున్నాడు. ఆమెను హతమార్చేందుకు స్నేహితులతో కలిసి ప్లాన్ వేశాడు.

అత్యాచారం కేసులో రాయ్‌బరేలీ కోర్టుకు హాజరయేందుకు ఆమె గ్రామం నుంచి బయలుదేరగా ఐదుగురు నిందితులు కాపుకాసి ఆమెను అడ్డగించి దాడిచేశారు. ఆపై కిరోసిన్ పోసి నిప్పుపెట్టారు. తీవ్ర గాయాలపాలైన ఆమెను వెంటనే  ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ  ఆమె తుదిశ్వాస విడిచింది.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *