హైదరాబాద్: హుజూర్‌నగర్‌లో తెరాస అభ్యర్థికి అద్భుతమైన మెజార్టీతో అఖండ విజయాన్ని ప్రజలు అందించారని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ప్రతికూల వాతావరణంతో తన సభ జరగకపోయినా ప్రజలు ఆశీర్వదించారని చెప్పారు. ఈ విజయం ప్రభుత్వానికి టానిక్‌లా పనిచేస్తుందన్నారు. హుజూర్నగర్ ప్రజలు ఉప ఎన్నిక ద్వారా కుండబద్దలు కొడుతూ తీర్పు చెప్పారని కేసీఆర్ అన్నారు. త్వరలోనే హుజూర్నగర్ వెళ్లి అక్కడి ప్రజలకు ధన్యవాదాలు చెబుతానన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష పార్టీలు దుర్మార్గమైన ఆరోపణలు చేశారని.. ఇప్పటికైనా అనవసర విమర్శలు మాని నిర్మాణాత్మక పాత్ర పోషించాలని కేసీఆర్ హితవు పలికారు.
