Breaking News
Home / National / తేజస్ ను ప్రారంభించిన యూపీ సీఎం…

తేజస్ ను ప్రారంభించిన యూపీ సీఎం…

లక్నో: దేశంలో తొలి ప్రయివేటు సెమీ హైస్పీడ్ రైలు తేజస్ ఎక్స్‌ప్రెస్ ఇవాళ ప్రారంభం అయ్యింది. ఢిల్లీ-లక్నోల మధ్య నడిచే ఈ కొత్త రైలు సర్వీసును ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా తొలి బ్యాచ్ ప్రయాణికులకు యోగి శుభాకాంక్షలు తెలిపారు. ఇతర నగరాల్లో కూడా ఇలాంటి సదుపాయం అందుబాటులోకి రావాలని కోరుకుంటున్నట్లు యోగి పేర్కొన్నారు. తేజస్ రైలు లక్నో నుంచి ఢిల్లీ చేరడానికి 6.15 గంటలు పడుతుంది. తేజస్ రైలు ఆలస్యమైతే ప్రయాణికులకు పరిహారం చెల్లిస్తామంటూ ఇటీవల రైల్వే మంత్రి పియూష్ గోయల్ ప్రకటించారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *