Breaking News
Home / National / హెచ్‌ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం….

హెచ్‌ 1బీ వీసాపై అమెరికా కీలక నిర్ణయం….

వాషింగ్టన్: అగ్రరాజ్యంలో ఉద్యోగానికి అవసరమైన హెచ్‌1బీ వీసా విషయంలో యూఎస్‌ ఎంబసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగంలో చేరే తేదీకి కనీసం 90 రోజుల ముందే వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలని ఈ మేరకు ట్వీట్‌ ద్వారా తెలిపింది. అమెరికాలో వర్క్‌ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే, ఉద్యోగంలో చేరే తేదీకి 90 రోజుల ముందు నుంచే ఐ 797 ఫారమ్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు అని చెప్పింది. ఇక ఐ797 ఫారం అనేది దరఖాస్తుదారులు/ పిటిషనర్లతో కమ్యూనికేట్‌ చేయడానికి లేదా ఇమిగ్రేషన్‌ ప్రయోజనాన్ని తెలియజేయడానికి యూఎస్‌ సిటీజన్‌షిప్‌ అండ్‌ ఇమిగ్రేషన్‌ సర్వీసెస్‌(యూఎస్‌సీఐఎస్‌) ఉపయోగించే పత్రం. దీనికి సంబంధించిన పూర్తి వివరాల కోసం యూఎస్‌సీఐఎస్‌ వైబ్‌సైట్‌లో చూడొచ్చు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *