Breaking News
Home / National / పాక్‌ను హెచ్చరించిన అమెరికా సెనెటర్లు….

పాక్‌ను హెచ్చరించిన అమెరికా సెనెటర్లు….

ఢిల్లీ : అమెరికన్‌ సీనియర్‌ సెనెటర్‌ మ్యాగీ హసన్‌ మరో సెనెటర్‌ క్రిస్‌ వాన్‌ హోలెన్‌తో కలిసి పాకిస్థాన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా సెనెటర్‌ హసన్‌ మాట్లాడుతూ తాలిబన్‌ సహా ఇతర ఉగ్రసంస్థలకు సహకారం అందించడం నిలిపివేయాలని పాకిస్థాన్‌ను హెచ్చిరించారు. దీనిపై ఆ దేశ నాయకులు ప్రముఖంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉందని గుర్తుచేశారు. హసన్‌ ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌తో పాటు ఆర్మీ చీఫ్‌ ఖమర్‌ జావెద్‌ బజ్వాతో భేటీ అయ్యారు. ఉగ్రవాదాన్ని అడ్డుకొని ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి తోడ్పడాలని ఈ సందర్భంగా అక్కడి నాయకులకు సూచించారు. ఉగ్రవాద భావజాలం వ్యాప్తి చెందకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, కశ్మీర్‌లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ వివాదాల పరిష్కారానికి పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు.

అంతకుముందు ఇరువురు సెనెటర్లు పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీవోకే)లో పర్యటించారు. అధికరణ 370 రద్దు తర్వాత భారత్‌-పాక్‌ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో అక్కడి పరిస్థితులను స్వయంగా పరిశీలించి ప్రాంతీయంగా శాంతి, భద్రతల్ని నెలకొల్పే దిశగా ఇరు దేశాలు సంయమనం పాటించాలని కోరారు. శుక్రవారంతో పాక్‌లో పర్యటన ముగించుకున్న ఈ బృందం శనివారం భారత్‌ చేరుకున్నారు. ఇక్కడ పలువురు నాయకులు, అధికారులతో భేటీ కానున్నారు. కశ్మీర్‌ పరిస్థితులు సహా భారత్‌-అమెరికా సంబంధాలపై చర్చించనున్నారు.

Check Also

భారత్‌కి దగ్గరగా తోకచుక్క…

Share this on WhatsAppమన భూమి చుట్టూ తరచూ తోకచుక్కలూ, గ్రహ శకలాలూ వెళ్తూనే ఉంటాయి. వాటిలో 95 శాతం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *