Breaking News
Home / World News / అమెరికాలో కుప్పకూలిన యుద్ధ విమానం….

అమెరికాలో కుప్పకూలిన యుద్ధ విమానం….

అమెరికా: యుద్ధ విమానం కుప్పకూలిన ఘటనలో ఏడుగురు మరణించిన ఘటన అమెరికా దేశంలోని కనెక్టికట్ ప్రాంత బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం నాటి బీ-17 బాంబర్ విమానం బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అత్యవసరంగా ల్యాండింగ్ చేస్తుండగా కుప్పకూలిపోయింది. ఈ యుద్ధ విమానం టేకాఫ్ అయిన పదినిమిషాలకే సాంకేతిక లోపం ఏర్పడటంతో అత్యవసర ల్యాండింగ్ చేసేందుకు యత్నించారు. విమానం ల్యాండింగ్ చేస్తుండగా రన్ వేపై నియంత్రణ కోల్పోయి కుప్పకూలిపోయింది. ఈ విమానంలో 13 మంది ఉండగా ఏడుగురు మరణించారు. మరో ఆరుగురు గాయపడటంతో వారిని ఆసుపత్రికి తరలించారు. విమానం కూలిన రన్ వేపై మంటలతో పాటు దట్టమైన పొగ వ్యాపించింది. దీంతో బ్రాడ్లీ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూడున్నర గంటలపాటు మూసివేశారు. యుద్ధ విమాన ప్రమాదంపై అమెరికా జాతీయ రవాణ భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తోంది.

Check Also

అంతుచిక్కని మరో వైరస్.. వందలాది మంది మృతి

Share this on WhatsAppతమ పొరుగు దేశం కజకిస్థాన్‌లో అంతుచిక్కని వైరస్‌ కారణంగా వ్యాధులు ప్రబలి, వందలాది మంది మృత్యువాత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *