Breaking News
Home / Health / కొబ్బరినూనె ఉపయోగాలు

కొబ్బరినూనె ఉపయోగాలు

అమరావతి: జుట్టు పోషణకే కాదు బాడీ లోషన్‌గా, టోనర్‌గా కూడా కొబ్బరి నూనెను వాడొచ్చు. దీనిలోని యాంటీ-వైరల్‌, యాంటీ- బ్యాక్టీరియల్‌ గుణాలు జలుబు, జ్వరం వంటి చిన్నచిన్న అనారోగ్యాలను నివారిస్తాయి. అంతేకాదు గర్భిణులకు సూపర్‌ఫుడ్‌గా కూడా పనిచేస్తుంది అంటున్నారు వైద్యురాలు సంగీతా రావు. ఆమె చెబుతున్న కొబ్బరి నూనె ఉపయోగాలు ఇవి…

తల్లీబిడ్డ ఆరోగ్యానికి: వంటలో టేబుల్‌ స్పూను కొబ్బరినూనె వేయాలి. దీంతో గర్భిణుల్లో కనిపించే మార్నింగ్‌ సిక్‌నెస్‌, వికారం వంటివి తగ్గుతాయి. తల్లి పాల తరువాత లారిక్‌ యాసిడ్‌ అధికంగా లభించేది కొబ్బరి నూనెలోనే. ఇది తల్లి, బిడ్డ రోగనిరోధక వ్యవస్థను పటిష్ఠం చేస్తుంది. అంతేకాదు బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచుతుంది కూడా. గర్భం దాల్చిన మూడో నెల నుంచి తొమ్మిదో నెల వరకూ కొబ్బరి నూనెను ఒంటికి రాసుకోవాలి. ఇలా చేయడం ద్వారా కాన్పు తరువాత చర్మం మీద కనిపించే గీతలు, మచ్చలు తొలగిపోతాయి.

పసిపిల్లల చర్మ సంరక్షణకు: కొబ్బరి నూనె చిన్నపిల్లల సున్నితమైన చర్మాన్ని ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. దోమ కాటు వల్ల పిల్లల చర్మం మీద ఎర్రమచ్చలు, దురద వంటివి ఏర్పడినప్పుడు కొద్దిగా కొబ్బరి నూనె రాస్తే చాలు తగ్గిపోతాయి.

బాడీ లోషన్‌గా: ప్రయాణ సమయంలో కొబ్బరి నూనెను రకరకాలుగా వాడుకోవచ్చు. ఇది క్లీన్సర్‌, మాయిశ్చరైజర్‌, హెయిర్‌ కండీషనర్‌, బాడీ లోషన్‌గా ఉపయోగపడుతుంది. మగవాళ్లు షేవింగ్‌ తరువాత కొబ్బరి నూనె రాసుకుంటే దద్దుర్లు, మచ్చలు ఏర్పడవు.

Check Also

క‌రోనాలో కొత్త‌గా ఆరు ల‌క్ష‌ణాలు..

Share this on WhatsAppఇప్ప‌టివ‌ర‌కు జ్వ‌రం, ద‌గ్గు, జ‌లుబును మాత్ర‌మే క‌రోనా ల‌క్ష‌ణాలుగా ప‌రిగ‌ణించాం.. కానీ ఇప్పుడు అది రూటు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *