Breaking News
Home / Lifestyle / Recipes / ఉసిరి మురబ్బా తయారీ విధానం మీ కోసం..!

ఉసిరి మురబ్బా తయారీ విధానం మీ కోసం..!

ఉసిరి మురబ్బా

కావలసిన పదార్థాలు: ఉసిరికాయలు – 10, పంచదార – ఒక కప్పు, నీరు – ఒక కప్పు, లవంగాలు – 2, దాల్చినచెక్క – అంగుళం ముక్క, మిరియాలు – 5, నల్ల ఉప్పు – చిటికెడు, కుంకుమపువ్వు – 4 రెమ్మలు.

తయారుచేసే విధానం: తగినంత నీటిలో ఉసిరికాయలు ఉడికించి గింజలు తీసేయాలి. ఇప్పుడొక పాన్‌లో ఒక కప్పు నీరు, పంచదారతో పాటుగా లవంగాలు, దాల్చన చెక్క, మిరియాలు వేసి చిన్నమంటపై 30 నిమిషాలు ఉడికించాలి. తర్వాత దించేసి 2 రోజుల పాటు పక్కనుంచాలి. తర్వాత మరోసారి వేడి చేసి చిక్కబడ్డాక ఉప్పు, కుంకుమపువ్వు కలిపి మరో పది నిమిషాలు ఉడికించి మంట తీసెయ్యాలి. చల్లారిన తర్వాత సీసాలో వేసి మూత పెట్టి ఫ్రిజ్‌లో ఉంచితే కనీసం 6 నెలల పాటు నిలువ ఉంటుంది. ఒక్కొక్క రెబ్బను చప్పరిస్తే చాలా రుచిగా ఉంటుంది.

Check Also

క్యాబేజీ పరోటా

Share this on WhatsAppకావలసిన పదార్థాలు : క్యాబేజీ- అర కిలో, అల్లం- తగినంత, పచ్చిమిరపకాయలు- 6, జీలకర్ర- తగినంత, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *