హైదరాబాద్: హుజూర్నగర్ రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ పచ్చి అబద్ధాలు మాట్లాడారని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును కేటీఆర్ చదివారని ఆరోపించారు. కేటీఆర్ తిరిగిన రోడ్లు తమ పార్టీ హయాంలో వేసినవేనన్నారు. హుజూర్నగర్ నియోజకవర్గంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క పని కూడా చేయలేదని దుయ్యబట్టారు. తమ్ముడు కేటీఆర్ నిజాలు తెలుసుకొని మాట్లాడాలని ఉత్తమ్ పేర్కొన్నారు.
