Breaking News
Home / National / కేసీఆర్‌కు అంత భయమెందుకు?: వీహెచ్‌

కేసీఆర్‌కు అంత భయమెందుకు?: వీహెచ్‌

హైదరాబాద్‌: టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంటిపైకి 50 మంది పోలీసులను పంపి దాడులు చేయించడం ఏ మేరకు సబబని కాంగ్రెస్‌ నేత వీ హనుమంత రావు ప్రశ్నించారు. హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు అంత భయమెందుకని సూటిగా అడిగారు. పోలీసులు కూడా టీఆర్‌ఎస్‌కు ప్రచారం చేయండని చెబుతున్నారని ఆరోపించారు. కూకట్‌పల్లి ప్రాంతంలో పోలీసు అధికారులు టీఆర్‌ఎస్‌ అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఇంటిపై, ప్రగతి భవన్‌పై పోలీసులు దాడులు చేయమంటే చేస్తారా అని ప్రశ్నించారు. 108,104 వాహనాల్లో డబ్బులు, మద్యం తరలిస్తున్నారని, కాంగ్రెస్‌, తెలుగుదేశం కార్యకర్తలు 108,104 వాహనాలను తనిఖీలు చేయాలని సూచించారు. తెలంగాణ డీజీపీ మహేందర్‌ రెడ్డి చెడ్డపేరు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మహిళలని కూడ చూడకుండా పోలీసులు బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపణలు చేశారు.

Check Also

కేదార్‌నాథ్‌లో మోదీ ‘స్టిల్ ఫొటోగ్రాఫర్’… వైరల్ ఫొటో!

Share this on WhatsAppకేదార్‌నాథ్: లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగియగానే ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌కు రెండు రోజుల పర్యటనకు వెళ్లారు. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *