గుంటూరు : ఆటో డ్రైవర్లకు వాహన మిత్ర ద్వారా ఒక్కొక్కరికి రూ.10 వేల ఆర్థిక సాయాన్ని గుంటూరులో మంత్రి మోపిదేవి వెంకటరమణ రావు శుక్రవారం అందచేశారు. మహిళ డ్రైవర్లకు కూడా ఈ సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఉప సభాపతి కోన రఘుపతి, జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద కుమార్, ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణ రావు, ఎమ్మెల్యేలు బ్రహ్మనాయుడు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.
