Breaking News
Home / States / Andhra Pradesh / Amaravati / అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వంశీ…

అసెంబ్లీ సమావేశాలకు హాజరైన వంశీ…

అమరావతి: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఇవాళ ప్రారంభమయ్యాయి. తొలిరోజే సమావేశాలు వాడివేడిగా జరుగుతున్నాయి. ఈ సమావేశాలకు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కూడా హాజరయ్యారు. అయితే ఆయన టీడీపీ బెంచీల వైపు వెనుక వరుసలో కూర్చున్నారు. టీడీపీకి రాజీనామా చేయడం.. ఇటు వైసీపీలో చేరకపోవడంతో.. అటు ఇటు కాకుండా టీడీపీ సభ్యులు కూర్చున్న వెనుకవైపు బెంచీలో కూర్చున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఒప్పందాలపై చర్చ జరుగుతోంది.

కాగా.. తాను త్వరలోనే వైసీపీ తీర్థం పుచ్చుకోబోతున్నానని.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితోనే తన పయనమని వంశీ ఇదివరకే ప్రకటించిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఇప్పటికే వైఎస్ జగన్ మోహన్‌రెడ్డితో పాటు వైసీపీకి చెందిన కీలకనేతలతో వంశీ పలుమార్లు వంశీ భేటీ అయ్యారు.

Check Also

వీధి బాలలకు కరోనా పరీక్షలు.. దేశంలోనే ఏపీలో తొలిసారిగా ముస్కాన్ కోవిద్ -19

Share this on WhatsAppకరోనా వైరస్ పరీక్షలు చేయడం లేదు మహాప్రభో అని కొన్ని రాష్ట్రాల్లో గగ్గోలు పెడుతుంటే, వీటి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *